“మాదకద్రవ్యాలు వద్దు బ్రో” అనే పోస్టర్లను ఆవిష్కరించిన తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పి // ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వులు మేరకు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ లోనీ, తణుకు పట్టణంలో గల బాలుర ప్రభుత్వ ఉన్నతపాఠశాల నందు శనివారం ఉదయం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మరియు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పి డి.విశ్వనాథ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తాడేపల్లిగూడెం డిఎస్పీ “మాదకద్రవ్యాలు వద్దు బ్రో’ అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్దులు వారి తల్లిదండ్రులు కు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సమస్యలపై అవగాహన కల్పించి “మాదకద్రవ్యాలు వద్దు బ్రో” అనే పోస్టర్లను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం డిఎస్పి డి.విశ్వనాథ్ మాట్లాడుతూ మీ చుట్టుపక్కల మిమ్మల్ని ప్రలోభ పెట్టి మిమ్మల్ని నాశనం చేయుట కొరకు మీ చుట్టుపక్కలే కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని మిమ్మల్ని గంజాయి మత్తులో దించడానికి చాలామంది ఎదురు చూస్తున్నారని, సరదాగా చేసే పని జీవితాన్ని నాశనం చేస్తుందని ఈ గంజాయి ఒక ఆకు రూపంలో,పౌడర్ రూపంలోz లభ్యమవుతుందని తెలియజేసారు. గంజాయి సేవించడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని తెలియని శక్తి లభిస్తుందని చెప్పి మిమ్మల్ని వాటికి దగ్గర చేస్తుంటారని తెలియజేశారు. డ్రగ్స్ వాడటం వల్ల మన మెదడు మన ఆధీనంలో ఉండదని సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయని, మత్తు పదార్థాల వలన నాడీ వ్యవస్థ దెబ్బతిని సరిగ్గా చదువు కోరని ఆరోగ్యం పాడువుతుందని, మత్తుపదార్థాలు ఇంకా ఇంకా కావాలని దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడి డబ్బులు కోసం మనకు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడుతుంటామని వాటి వల్ల జీవితం సర్వనాశనం చేసుకుంటూ జైలు పాలు అవ్వాల్సి వస్తుందని తెలియజేశారు. గంజాయి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయని కూడా తెలియజేశారు. ఈ మధ్యకాలంలో సమాజంలో గంజాయిని చాక్లెట్ల రూపంలో కూడా తయారు చేసి వాటిని అమ్ముతున్నారని అటువంటివి ఏమైనా మీ దృష్టిలో ఉంటే మాకు సమాచారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పేరుతో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి జిల్లాలోను ఈ టాస్క్ ఫోర్స్ విభాగం ఉంటుందన్నారు. గంజాయి విస్తరించడంలో కీలకపాత్ర పోషించే ఫెడ్లర్స్, ట్రాన్సుపోర్టర్స్, కంజూమర్స్ పై దృష్టిపెట్టి నియంత్రించడమే లక్ష్యంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ ఆంధ్రా ఒడిస్సా సరిహద్దుల నుండీ గంజాయి అక్రమ రవాణా/సరఫరా జరుగుతోందన్నారు. ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో చెలగాటమాడే గంజాయిను సమిష్టిగా నిరోధించాలనే లక్ష్యంతో సరిహద్దు ప్రాంతాల వద్ద చెక్ పోస్ట్లు పెట్టి నిఘా పెంచామన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే 1972 కి సమాచారం అందించాలని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయితే 1930 కి కాల్ చేయాలని విద్యార్థిని విద్యార్థులకు హాజరైన తల్లిదండ్రులకు తెలియ జేస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించి, పోస్టర్ లను ఆవిష్కరించి, నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మార్వో డి వి ఎస్ ఎస్ అశోక్ వర్మ, టౌన్ సిఐ ఎన్ కొండయ్య, స్కూలు ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.