తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యలమర్తి తిమ్మరాజా (వై.టి. రాజా) జయంతి సందర్భంగా తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో వై.టి.ఆర్. చితపటానికి పూలమాలలు వేసిన ఘన నివాళులర్పించిన కూటమి నాయకులు, మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి వెంకట కృష్ణారావు, వైటి రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ తణుకు నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి వై.టి రాజా అని అన్నారు. సామాజిక సేవలు అందించడంలో వై.టి రాజా ముందుండేవారిని, తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, నిజాయితీ వెలకట్టలేనిదని అన్నారు. ఆఖరి శ్వాస వరకు పార్టీకి చిత్తశుద్ధితో సేవలందించినటువంటి మహోన్నత వ్యక్తి వై.టి రాజా అని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు మార్గదర్శకంగా ఉండే వారిని అన్నారు. అనంతరం తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు ప్రభుత్వ హాస్పిటల్ నందు పేషెంట్లకు పండులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో టి.డి.పి.నాయకులు కలగర వెంకట కృష్ణారావు, బసవా రామకృష్ణ, వావిలాల సరళాదేవి, వంటెద్దు రాజా, గుబ్బల శ్రీనివాసు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.