తణుకు పట్టణంలోఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న డాక్టర్ జగజీవన్ రావ్ నగర్ నందు జరిగిన కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క ప్రదేశమును అరుంధతి నగర్ అని నామకరణం చేయాలన్నారు. అరుంధతి నగర్ యువజన సంక్షేమ సంఘం నూతన కమిటీ బాధ్యతలు సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రాజ్ కుమార్ కి మరియు డాక్టర్ జగజ్జీవన్ రావుకి మరియు అరుంధతి నగర్ యువత సంఘం నాయకులకు శుభాకాంక్షలు తెలిపినారు. మీ అరుంధతి నగర్ నుంచి నా దృష్టికి తీసుకువచ్చిన వాటి అన్నిటిని తప్పనిసరిగా పరిశీలన చేసి శిధిలా వ్యవస్థలో ఉన్న మీ కమ్యూనిటీ హాల్ ని త్వరలో నిధులు మంజూరు చేసి అక్కడ నూతన కమ్యూనిటీ హాల్ నిర్మించే విధంగా కృషి చేస్తానని అన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ కి అన్ని విధాల కృషి చేస్తానని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య గాని చెరువులు సమస్య గాని పెరేడ్ గ్రౌండ్ కి గాని అభివృద్ధి చేస్తానని అన్నారు.
పార్టీలకు అతీతంగా ఈ అరుంధతి నగర్ ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానని అన్నారు.
ప్రభుత్వము నుంచి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమములు కూడా అర్హులైన వారందరికీ అందించే విధంగా కృషి చేస్తానని, ఈ వార్డులో ఉన్న పారిశుధాన్ని పెంపొందించి ఎప్పటికప్పుడు దోమలపై సమస్య తగ్గించే విధంగా కృషి చేస్తానని మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తానని ఈ సందర్భంగా మాట్లాడినారు. నూతన కార్యవర్గం పాల్గొన్నారు.