వెబ్ వారియర్స్ పై వెబ్ టైగర్స్ విజయం- వెబ్ టైగర్స్ టీం తరఫునుంచి శ్రీలతకి కృతజ్ఞతలు!

ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు సహకారంతో విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో అత్యంత వేడుకగా క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. వైజాగ్ మీడియా క్రికెట్ టోర్ని 2024 రెండవరోజు ఉదయం తలపడ్డ టీమ్ వివరాలు వెబ్ టైగర్స్, వెబ్ వారియర్స్ ఈ మ్యాచ్ విన్నర్స్ వెబ్ టైగర్స్. వివరాలు లోకి వెళితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెబ్ టైగర్స్ 18 ఓవర్లు మ్యాచ్లో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేశారు. రెండో బ్యాటింగ్ చేసిన వెబ్ వారియర్స్ 18 ఓవర్లో 8 వికెట్లు నష్టానికి 129 పరుగులతో ఓటమిపాలయ్యారు. గెలిచిన వెబ్ టైగర్స్ సెమీఫైనల్ లో స్థానం సంపాదించారు. వెబ్ టైగర్స్ టీం కి మేనేజర్ గా వ్యవహరించిన శ్రీలత టీం ప్లేయర్స్ కి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. వెబ్ టైగర్స్ తరఫునుంచి శ్రీలతకి కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top