రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన ఇద్దరు క్షతగాత్రులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చికిత్సనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్తిలి మండల సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ మార్గంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ వెళుతుండగా స్థానిక అక్కమాంబ టెక్స్టైల్స్ వద్ద రెండు మోటర్ సైకిల్స్ ఢీకొని ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో స్పందించిన రాధాకృష్ణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహాయపడ్డారు.
