స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో బాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఆర్.ఎస్.ఎస్.వి ప్రసాద్ సిబ్బందితో స్వచ్చ ఆంధ్రా ప్రతిజ్ణ చేయించారు. ప్రతిఒక్కరూ ప్రతి మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రత కొరకు కేటాయించాలని , శ్రమదానం చేసి పరిశుబ్ర ఆంద్రప్రదేశ్ గా మార్చడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని తెలియజేశారు. ఇక నుండి ప్రతి ఒక్కరూ తరచూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే కార్యక్రమం, చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం . సుబ్రహ్మణ్యం, ఆరోగ్య పర్యవేక్షకులు జి.శ్రీనివాసు, కె.నాగమణి, పబ్లిక్ హెల్త్ నర్స్ కె,డి,వి.ఎల్. కుమారి, ఫార్మసిస్ట్ వై. శ్రీదేవి, మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
