ప్రయాణికుల భద్రత కొరకు అవగాహన కల్పించడానికి ఈ నెల 16 – 1-2025 నుండి 15-2-2025 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నిర్వహిస్తున్న రోడ్ భద్రత మాసోత్సవాలలో భాగంగా శనివారం తణుకు డిపో గారేజ్ ఆవరణలో డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ అధ్యక్షతన రోడ్ భద్రత మాసోత్సవాల సభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ CTM (O&C) పాలగిరి వెంకటసుబ్బారెడ్డి, తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగుల కొండయ్య, ముఖ్య అతిధిలుగా పాల్గొని ప్రమాదాల నివారణకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లు, డ్రైవర్ లు, కండక్టర్ లు, మెకానిక్ లు , ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
