యోగివేమన శతజయంతి ఉత్సవాలలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిమండలం ఆరవల్లి గ్రామంలో యోగివేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగి వేమన “శత జయంతి ఉత్సవములు ఆరవల్లి గ్రామపురజనుల సహకారంతో యోగి వేమన విగ్రహం ఏర్పాటు చేసి ప్రతియేడాది నిర్వహించే వేమన జయంతి ఉత్సావాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా సాహితీ అభిమానులు విచ్చేసారు. అదేవిదంగా ప్రముఖ తెలుగు సినీనిర్మాత అచ్చిరెడ్డి విచ్చేసి వేమన జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు ఆరవల్లి గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
