సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు అండగా నిలబడి మహిళలకు ఒక అన్నగా అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల ప్రజలకి పెన్నిధిగా తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకు కూడా రాజకీయం గురించి సేవా కార్యక్రమాలు గురించి చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. ఆయన సినీరంగంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఒక సినిమాలలో అనేక పౌరాణిక పాత్రలలో సామాజిక, సాంఘిక పాత్రలలో ఎంతోమంది ప్రజల జీవితాల మీద ప్రభావితం చేసే విధంగా ఆయన నటించి ఎన్నో విజయాలు సాధించి వ్యక్తులలో ఆయన ప్రముఖ స్థానంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలో అధికారంలోకి తీసుకుని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని ఈరోజు వరకు కూడా అది ఒక రికార్డు అని చెప్పవచ్చు అది ఒక ఎన్ టి. రామారావుకే సాధ్యమైందని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనేక సంక్షేమ సాంఘిక కార్యక్రమాలను పేదప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అనే విధంగా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆరోజు అన్న ఎన్టీ రామారావు వేసినబాట వల్లనే సాధ్యమైందని అన్నారు. ఒకపక్క సంక్షేమాన్ని ఒకపక్క అభివృద్ధిని తీసుకొని వెళ్లి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిని పరుచుకొని ఇప్పటికీ కూడా ప్రపంచంలో సర్వే చేసిన ప్రజలగుండెల్లో సుస్తర స్థానాన్ని ఏర్పరచుకొని విజేతగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావుని అన్నారు. తెలుగుదేశం పార్టీలో అనేక సంస్కరణల ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి పేద ప్రజల ఉన్నతికి పాటుపడినటువంటి వ్యక్తి రామారావు గారిని తరువాత చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో అభివృద్ధి సంక్షేమం, సుపరిపాలన నాదంతో ఏదైతే ఎన్టీ రామారావు ఎంచుకున్నటువంటి బాట ఏదైతే ఉందో అదేబాటలో అనుగుణంగా నడుస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధిక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు నమోదైనవి అంటే ఈరోజు చరిత్రలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించు ఉన్నది అంటే అదే ఎన్టీ రామారావు వేసిన పునాది అని అన్నారు. ఆరోజు ఒక్కడిగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఈరోజు 42 సంవత్సరముల తర్వాత కోటి మంది సభ్యులుగా చేరిన పార్టీ ఈరోజు ఒక రికార్డు సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేటువంటిపార్టీ తెలుగుదేశం పార్టీ అని అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజలు పక్షాన నిత్యం పోరాడేటువంటి తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణములో కప్పల వెంకన్న సెంటర్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ బిల్డింగ్ వద్ద రక్త దాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
