అమిత్ షా గో బ్యాక్ గో బ్యాక్ అంటూ సిపిఎం పార్టీ కార్యకర్తలు నినాదాలు ఆదివారం నాడు ఇరగవరంలో బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా కామన్ మునుస్వామి మాట్లాడుతూ రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తూ అవమానంకరంగా మాట్లాడిన అమిత్ షా గోబ్యాక్ గోబ్యాక్ అంటూ అన్నారు. గత రెండురోజులు నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేస్తున్నారని అమిత్ షా రాష్ట్రంలో నుంచి వెనక్కి వెళ్లిపోవాలని సిపిఎం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన బి.ఆర్.అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి తన పదవికి రాజ్యానికి చేయాలనిలేని పక్షంలో సిపిఎం పార్టీ ఇతర పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు పిల్లి కోటేశ్వరరావు, జక్కంశెట్టి గంగాధరరావు, తూరుగొప్పుల వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
