తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో సాధనాల రామకృష్ణకు చెందిన తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ రఘుమండ తేజశ్రీ, ఉపసర్పంచ్ కటారి సిద్ధార్థరాజు, వార్డు మెంబర్ రఘుమండ శ్రీను ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు సాధనాల రామకృష్ణ కుటుంబానికి నిత్యావసరాల నిమిత్తం 10వేల రూపాయలు అందజేస్తున్నామని, ప్రభుత్వం నుండి అందించే సహాయానికి తోడ్పాటుచేస్తామని తెలిపారు.
