రూ. 2.20 కోట్లు నిధులతో రాతి నిర్మాణానికి చర్యలు
వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
భవిష్యత్తు తరాలకు రేలంగి లక్ష్మీనరసింహస్వామి వారి వైభవాన్ని చాటి చెప్పేలా రాతి కట్టడాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన దాతలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణను ఇరగవరం మండలం రేలంగి గ్రామస్తులు కలిసి దేవాలయం పునర్నిర్మాణానికి జరుగుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయం పునర్నిర్మాణానికి గ్రామస్తులు రూ. 73.33 లక్షలు విరాళాన్ని సేకరించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా సి.జి.యఫ్ నిధులనుంచి రూ. 1.46 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
మొత్తం మీద రూ. 2.20 కోట్లు నిధులతో ఆలయం రాత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు దేవాలయ నిర్మాణానికి సంబంధించి మరిన్ని నిధులు సహకరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.