తణుకు మండలం వేల్పూరు గ్రామంలో కోళ్ల ఫారంలో వైరస్ సోకినట్లు అధికారులు నిర్థారించారు. కిలో మీటరు పరిధిలోని రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.
ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పది కిలోమీటర్లు పరిధిలో చికెన్, కోడి గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు. చికెన్ తినడం కొన్నాళ్లు ఆపుకోవాలని సూచించారు.
వేల్పూరులోని వైరస్ సోకిన కోళ్లఫారం మూడు నెలల తర్వాత క్వారంటైన్ చేసి అనంతరం వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. పౌల్ట్రీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వడానికి చర్యలు. ఆరువారాలు దాటిన కోడికి రూ. 50, గుడ్లు పెట్టే కోళ్లుకు రూ. 140 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ఫారాల్లో ఉన్న కోడిగుడ్లుకు రూ. 3, మేత కిలోకు రూ. 12 చొప్పున పరిహారం అందించడానికి చర్యలు చేపట్టాం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు