దీర్ఘకాలికంగా ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్న తణుకు పట్టణంలోని 32వ వార్డుకు చెందిన కాశిన శ్రీను అనే బాధితుడికి రూ. 20 వేలు ఆర్థిక సాయాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం అందజేశారు. ఈ మేరకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితుడికి నగదును అందజేశారు. పేద కుటుంబానికి చెందిన శ్రీను ఎన్నో ఆసుపత్రులకు తిరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే చెప్పారు. తనను సంప్రదించగా తిరుపతిలోని కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించి శస్త్రచికిత్స చేయడానికి తన వంతు సహకారం అందజేసినట్లు వెల్లడించారు. సుమారు రూ. 1 లక్ష ఖర్చు అయ్యే శస్త్రచికిత్సను కేవలం రూ. 50 వేలకు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.
