పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కేంద్రంలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక విలేకర్ల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో 1/70చట్టాన్ని కూటమి ప్రభుత్వము పటిష్టంగా అమలు చేస్తుందని వైసిపి పార్టీ ప్రలోభాలకు ఆదివాసులు ఎవ్వరు లొను కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ హక్కులను ఎవ్వరు భంగం కలిగించిన పార్టీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమిస్తాము అన్నారు. 1917 నుంచి 1959 దాక చేసిన చట్ట సవరణలు ఆన్ని ఆదివాసీ ప్రాంతంలో సర్వహక్కులు ఆదివాసులుదే అని స్పష్టం చేసి ఉన్నాయి అని 1960 సం, శ్రీకాకుళం రైతంగా సాయుధ పోరాటం భూమి కోసం జరిగిన ఉద్యమంలో అనేకమంది పోరాట త్యాగ ఫలితమే 1/70చట్టం అని ఆదివాసీ ప్రాంతంలో గిరిజన నేతరులతో పాటు ప్రభుత్వము కూడా గిరిజన నేతరే అని సమతా జడ్జి మెంట్లో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 5 వ షెడ్యూల్ భూభాగంలో సర్వహక్కులు ఆదివాసులుదే అని భారత రాజ్యాంగం ఆర్టికల్ 244 లో స్పష్టంగా ఉంది అన్నారు. వైసిపి ప్రభుత్వంలో జి ఓ నెం 3. రద్దైనప్పుడు కనీసం రివ్యూ పిటిషన్ వెయ్యలేని దౌర్భాగ్యులు వైసిపి నాయకులూ కాదా అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలోనే ఐటిడిఎ లు ఏర్పాటు చేశాం అని 275 జి.ఓ. తెచ్చి అదివాసులతోనే అన్ ట్రినెడ్ డీఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించమని విద్య అబివృద్ధి కోసం ప్రాథమిక పాఠశాలలు జూనియర్ కాలేజీలు,ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు అలాగే ఏజెన్సీలో బస్ డిపో, హాస్పిటల్స్ తో పాటు ఏర్పాటు చేశాం అని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అని అలాగే వైసిపి ప్రభుత్వ హయంలో విదేశి అంబేద్కర్ విద్యను బెస్ట్ అవైలబుల్ స్కూల్ సిట్స్ రద్దు చేసారని ట్రైకర్ ద్వారా అనేక సబ్సిడీ ఋణాలు పీవీటీజీ ఇతర కులాలకు ఇవ్వవలసి ఉన్నప్పటకి ఒక్కరికీ కూడా ఇవ్వలేని చేతకాని పరిపాలన వైసిపి ప్రభుత్వము దే అని ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూటమి ప్రభుత్వందే అని అసెంబ్లీకి వెళ్ళని వైసిపి ఎంఎల్ఏ లను గెలిపించడం ఆదివాసుల దురదృష్టం అని వైసిపి మోసపూరిత అబద్ధపు వలలో పడవద్దని ఆదివాసీ ప్రజానీకానికి కోరుతున్నామని గిరిజన నేతరులకు సెంటున్నార భూమి పట్ట ఇవ్వాలి అని నాడు వైసిపి నిర్ణయించలేదా అని అది ఆదివాసీ హక్కుల చట్ట వ్యతిరేకం కదా అని వైసిపి పై ఆగ్రహం వ్యక్తం చేసారు అలాగే బోయ వాల్మికులను ఎస్ టి జాబితాలో చేర్పిస్తమని నాడు వైసిపి ప్రభుత్వము చెప్పలేదా, అప్పుడూ వైసిపి నాయకులంతా ఎక్కడున్నారని ఇంకా ఆదివాసీ ప్రజలను మోసం చెసే కుట్రలు మానుకోవాలని లేనియెడల వైసిపి ప్రజా ఆగ్రహనికి గురికాక తప్పదని మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
