పశు వధ కర్మాగార కార్య క్రమాల్ని తక్షణం నిలిపివేయాల ని హైకోర్ట్ స్టే విధించడం ప్రజా స్వామ్య విలువలకు, ప్రజా ఉద్యమాలకు న్యాయం సమకూరుతుందని విశ్వస్వం ప్రజల్లో కలిగిందని శాసనమండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ అన్నారు. స్థానిక ప్రజలు, గోసేవసమితి, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు చేసిన పోరాటానికి న్యాయం జరిగిందని అన్నారు.
స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఫ్యాక్టరీ యాజమాన్యం అమానుషంగా వ్యవహరించిందని, నిబంధనలు ఉల్లంఘించారని ఎమ్మెల్సీ వంకారవీంద్రనాథ్ అన్నారు .
స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, యజమాన్యం స్టే వేకెట్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయగలదని , ఆ చర్యలను పసిగడుతూ ఎవరూ దానికి సహకరించకుండా చూసుకోవాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అన్నారు. ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
