మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి డా.కంచర్ల రూ.10వేలు ఆర్దిక సహాయం
విశాఖలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న వెంకటేష్ మృతిచెందడంతో ఆయన పెద్దఖర్మ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ సంఘ సేవకులు డా.కంచర్లచ అచ్యుతరావు రూ.10వేలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాకు బుధవారం ఉదయం జమచేశారు. విశాఖలో పనిచేస్తున్న జర్నలిస్టులు, కళాకారులు కుటుంబాలకు ఏ చిన్న ఆపద వచ్చినా తొలుత స్పందించేది డా.కంచర్ల అచ్యుతరావు మాత్రమే. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టు వెంకేటష్ మృతి వార్త తెలుసుకున్న ఆయన తనవంతు సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా ఇంకా తన నుంచి ఎలాంటి సమాయం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా చేయనంత ఆర్దిక సహాయం ఒక్క మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, వారికుటుంబ సభ్యుల కోసం డా.కంచర్ల అచ్యుతరావు చేస్తూ వస్తున్నారు. కాళాకారులు, క్రీడాకారులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు కంచర్ల తనవంతు సహాయంగా మట్టిఖర్చులకు తానే ముందుండి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తుండటం విశేషం. జర్నలిస్టులు, మీడియాకి ఇతోధికంగా సహాయం చేస్తున్న డా. కంచర్ల చేయూతపై విశాఖలోని మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.