వార్డునకు అదనంగా పారిశుధ్య కార్మికులను పెంచాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కు వినతి అందజేసిన గంకల కవిత అప్పారావు యాదవ్
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పట్టాభి రామ్ ను జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవితా అప్పారావు యాదవ్ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. 48 వార్డులో పారిశుధ్య సమస్యను పరిష్కారం చూపాలని కోరారు.జీవీఎంసీ 48వ వార్డ్ అంత కొండవాలు ప్రాంతంతో కలిపి ఉంటుందని కొండవాలు ప్రాంతం కావడంతో చిన్న చిన్న సందులు,చిన్న చిన్న కాలువలు ఉండడం వలన వార్డులో పారిశుధ్య సమస్య ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా వార్డులో వయసు పైబడుతున్న పారిశుధ్య కార్మికులు ఉండడం వలన వారికీ కొండవాలు ప్రాంతంలో విధులు నిర్వహించడం వయసు రీత్యా కష్టం అవుతున్నదని, వారి స్థానంలో వేరొకరిని నియమించి, పారిశుధ్య సిబ్బంది సంఖ్యను పెంపు చేయాలని కోరారు. వార్డులో పారిశుధ్య పనుల నిమ్మితం నూతన పారిశుధ్య పనిముట్లు, కొత్త డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసి కొండవాలు ప్రాంతం,మురికి వాడాలలో పారిశుధ్య పనులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. వార్డులో గల పారిశుధ్య సమస్య పరిష్కారం కోరుకు పుష్ కార్ట్ బిన్స్,చిన్న పారలు, కొంకేలు, గంబూట్స్, బ్లీచింగ్ పౌడర్ బస్తాలు, సున్నం బస్తాలు వంటివి ఏర్పాటు చేయాలనీ తక్షణమే సంబంధిత శాఖ కు తెలియపరిచి 48వ వార్డులో పారిశుధ్య సమస్య పరిష్కారం చూపాలని కోరారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు గంకల కవిత అప్పారావు యాదవ్ తెలిపారు.