జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఐదు రోజులు వేడుకల్లో భాగంగా రెండవరోజు ఆచంట నియోజకవర్గం, పోడూరు మండలం పోడూరు గ్రామం లో పోడూరు మండలం జనసేన నాయకులు సౌజన్యంతో పారిశుధ్య కార్మికులకు బియ్యం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పగోజిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి నుండీ ఆచంట నియోజకవర్గం లో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందని, ఐదురోజులా వేడుకల్లో రెండవ రోజు పారిశుధ్య కార్మికులు కు బియ్యం పంపిణి చెయ్యడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలుకు అనుగుణంగా ఆయన ఆలోచనలను ఆచరణలో పెడుతూ జనసేన సైనికలు పారిశుధ్య కార్మికులకు అండగా నిలబడటం సంతోషంగా ఉంది అన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రటరీ, పోడూరు మండలం అధ్యక్షులు రావి హరీష్ బాబు, పోడూరు గ్రామ అధ్యక్షులు బొక్కా గణపతి, మండల ఉపాధ్యక్షులు తోలేటి వేణు, విద్యాకమిటి చైర్మన్ పట్నాల నాగేశ్వరావు, మినిమంచిలి పాడు గ్రామఅధ్యక్షులు రవి,గెద్దాడ శ్రీను, వల్లూరు గ్రామ జనసేన అధ్యక్షులు కడిమి ఉమా మహేశ్వరస్వామి, గ్రామప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు తన్నేడి రాంబాబు, వెంకట్, ఇర్రింకి నాగరాజు, నాయుకులు తోట సాయిబాబా, ఏడిద బాలు మొదలగువారు పాల్గొన్నారు.
