చదువుల తల్లి, అనితర సాద్వీమణి, భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీబాయ్ ఫూలే ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని దళిత చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయ్ ఫూలే వర్ధంతి సభను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.సరస్వతీ అధ్యక్షతన దళిత చైతన్య వేదిక నాయకులు నిర్వహించారు. తొలుత సావిత్రిబాయ్ ఫూలే చిత్రపటానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి నాయకులు, స్కూల్ సిబ్బంది పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దళిత చైతన్య వేదిక పే బ్యాక్ టు ధ సొసైటీ ప్రోగ్రాంలో భాగంగా రాజోలు బోయ్స్ హైస్కూల్లో 64 మంది పదోవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నలు, స్కేళ్ళు, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఏరైజర్స్ ను రాజోలు మండల పరిషత్ ఉపాధ్యక్షులు పొలుమూరి శ్యాంబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పదోవ తరగతి పబ్లిక్ పరీక్షలు బాగా వ్రాసి అత్యధిక మార్కులు సాధించి విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించాలన్నారు. దళిత చైతన్య వేదిక నిర్వహిస్తున్న పే బ్యాక్ టు ధ సొసైటీ కార్యక్రమాలకు సహకరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల రెండోవ విద్యాధికారి టిఎస్కేడి ప్రసాద్, రిటైర్డ్ ఎంఈవో జొన్నలగడ్డ గోపాలకృష్ణ, గర్ల్స్ హైస్కూల్ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఏ త్రీమూర్తులు, దళిత చైతన్య వేదిక నాయకులు చిలకపాటి శ్రీధర్, మందపాటి మధు, జిల్లెళ్ళ వినోద్ కుమార్, మెడబల శ్యాం శేఖర్, ఉపాధ్యాయులు జి సుబ్బరాజు,ఆర్ అంభ,బిహెచ్ నాగేశ్వరరావు, సిహెచ్ లీలావతి, ఏంజిఆర్ఎల్ గణపతి, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
