ఆంధ్రప్రదేశ్ బి.సీ స్టడీ సర్కిల్, రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ నందు మెగా డి.యస్.సి. పరీక్షల కొరకు ఆన్-లైన్ ద్వారా త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి / బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు బి శశాంక సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సంచాలకులు విజయవాడ వారి ఆదేశాల మేరకు టెట్ (టీచర్ ఏలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలో అర్హత సాధించిన వారికి తూర్పుగోదావరి జిల్లా వాసులకు మాత్రమే బి. సి..(BC) మరియు EWS (EBC) కేటగిరీలకు చెందిన అభ్యర్థుల నుండి మెగా డి.యస్.సి. పరీక్షల కొరకు ఉచిత ఆన్-లైన్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. టెట్ నందు ఉత్తీర్ణులైన వారు అర్హులు మరియు టెట్ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుదురు. ఈ శిక్షణ కొరకు మార్చి 10వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలియజేశారు.
మెగా డి.యస్.సి. ఆన్-లైన్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేయు వారు టెట్ (టీచర్ ఏలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలో అర్హత సాదించిన మార్కుల పత్రము, నేటివిటీ పత్రము, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు మరియు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి ఆంధప్రదేశ్ బిసి స్టడీ సర్కిల్, ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో, వై-జంక్షన్ , రాజమహేంద్రవరం కార్యాలయము నందు నేరుగా మీ దరఖాస్తులు అందజేయవలెను. మార్చి 10వ తేదీ నుండి దరఖాస్తు పత్రాలను బిసి స్టడి సర్కిల్ నుండి పొందవచ్చును.
మరిన్ని వివరాలకు నేరుగా కార్యాలయమును గానీ , ఫోన్ నెంబరు 9393934825, 9705326221, 9000058102 లను సంప్రదించగలరని తెలియజేశారు.