నిడదవోలు చర్చ్ పేట లో హోప్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ నందు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత.
పదో తరగతి పరీక్షలు అద్భుతంగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను దీవించిన వాకర్స్ క్లబ్ కార్యవర్గం సభ్యులు.
పరీక్ష సామాగ్రి అందజేసిన వాకర్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపిన పదవ తరగతి విద్యార్థులు.
ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎవరూ కూడా తొందరపడకుండా రిలాక్స్ గా సమయానికి వెళ్లి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, సూచనలను తెలియజేసిన సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ దారపు రెడ్డి ప్రతాప్, RC సెనగన కృష్ణమూర్తి, వాకర్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ రాజా, సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, రాఘవేంద్ర కుమార్, ప్రసన్న రాజు, జయ, హారిక పాల్గొన్నారు.