పెరవలి డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని అన్ని నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షుల సమావేశం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ బూరుగుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన మధ్యాహ్నం 4:00 గంటలకు పెరవలి లాక్ కాంపౌండ్ నందు జరిగింది.
ఈ సమావేశంలో పెరవలి డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని నీటి వినియోగం, వ్యవసాయ నీటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మరియు ఇతర సంబంధిత అంశాలపై సమగ్రంగా చర్చించారు. అన్ని సంఘాల అధ్యక్షులు తమ సూచనలు, సలహాలు తెలియజేసి, సమస్యల పరిష్కారానికి సహకారం అందించారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
పెరవలి లాక్ కాంపౌండ్ పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు.
అన్ని సంఘాల పరిధిలోని చెత్త, తూడు మరియు పూడికనీ తొలగించాలని తీర్మానించారు.
అవసరమైన ప్రాంతాల్లో గోడలు నిర్మించడం, మరమ్మత్తులు చేయడం మరియు రీపాయిర్ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
వివిధ సమస్యలపై చర్చ జరిపి, తగిన పరిష్కారాలు అమలుచేయాలని సూచించారు.
సమావేశానికి హాజరైన అధికారులు & సంఘాధ్యక్షులు:
ఈ సమావేశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (నరసరాపురం) వెంకట నారాయణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్ సెక్షన్, పెరవలి) శ్రీ ఎన్. బాలమురళీకృష్ణ పాల్గొన్నారు.
అలాగే పెరవలి సంఘ అధ్యక్షులు గుణ్ణం పట్టాభి రామ్, తణుకు సంఘ అధ్యక్షుడు నందిన వెంకటేశ్వరరావు, టి. వేమవరం అధ్యక్షుడు నల్ల బాస్కరరావు, పేకేరు అధ్యక్షుడు నల్ల సురేంద్ర, ఖండవల్లి సంఘ అధ్యక్షుడు అడ్డగాళ్ల శ్రీరామమూర్తి, ఉండ్రాజవరం సంఘ అధ్యక్షుడు రామదాసు, ఇరగవరం అధ్యక్షుడు మల్లుల బాస్కరరావు తదితరులు హాజరయ్యారు.