ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు 5.75,000/- ఆర్ధికసహాయం
- హౌసింగ్ ఏ ఈ బి.ఏడుకొండలు
రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారం లో భాగముగా 2029 నాటికి ” అందరికీ ఇల్లు “ కార్యక్రమంలో ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/- అదనపు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు హౌసింగ్ సహాయ ఇంజనీర్ బి. ఏడుకొండలు తెలియ చేశారు.
మంగళవారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామ పరిధిలో పలువురు లబ్దిదారులను కలిసి అవగాహనా కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏ ఈ బి. ఏడుకొండలు మాట్లాడుతూ, ఉండ్రాజవరం మండలం పరిధిలో 454 మంది గృహ లబ్దిదారులు ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉందన్నారు. వారికీ ప్రభుత్వం అదనంగా అందిస్తూన్న ఆర్ధిక సహాయం గురించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఉండ్రాజవరం మండలం పరిధిలో 454 మంది లబ్దిదారులు ఉండగా ఇప్పటి వరకూ 166 మందికి సమాచారం అందించి, వారిలో 163 నేరుగా వారిని కలవడం జరిగిందన్నారు. వారిలో ఇంటి నిర్మాణం కోసం 117 మంది లబ్దిదారులు ఆసక్తీ చూపినట్లు తెలిపారు. మే నెలాఖరు నాటికి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా అవగాహనా కల్పించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారం లో భాగముగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు “ ఏర్పరచాలనే దృఢనిశ్చయంతో ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు కలక్టర్ ప్రశాంతి తెలిపారు. మే నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 21,584 మంది లబ్దిదారులు ఉండగా, ఈ ఏడాది మే నెలాఖరు నాటికి 6 వేల గృహ నిర్మాణాల లక్ష్యాన్ని అనుసరించి ఇప్పటి వరకు 3950 మందిని కలవగా వారిలో 3,147 మంది ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు.