కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలను సీఎం చంద్రబాబు దంపతులు అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్ట్కు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత స్వామి వారి ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులను వేద పండితుల ఆశీర్వాదించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ రోజు రాత్రికి చంద్రబాబు దంపతులు స్థానిక టీటీడీ అతిథి గృహంలో బస చేయనున్నారు. శనివారం ఉదయం 9.00 గంటలకు ఒంటిమిట్ట నుంచి నేరుగా కడప విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్నారు.
