మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ , జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని అన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనివి అని చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్, 41వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐతి. మధుబాబు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనసూరి మధు , రాజమండ్రి నారాయణ, కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, కోట నరేష్, విల్లూరి చక్రవర్తి, గొల్లంగి ఆనందబాబు, కోయిలడ వెంకటేష్ , కేదారి లక్ష్మి, బోడ్డేపల్లి లలిత, మహమ్మద్ గౌస్, త్రినాధ్, సనపల కిర్తి, రవి శంకర్, సారి పల్లి మహేష్ , ఉరుకూటి గణేష్, అబ్దుల్ అనీఫ్, ఉరుకూటి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
