సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ
సహజ యోగ ధ్యానాన్ని ప్రతిరోజూ ఆచరించటం వలన, కుండలినీ జాగృతి ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చునని సహజ యోగ రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ అన్నారు. శ్రీ మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి నుంచి 28 వ తేదీ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలో సహజ యోగ చైతన్య ప్రచార రథయాత్ర జరుగనున్నది. ఈ రథం తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్, కోదాడ, హుజూర్ నగర్, మఠంపల్లి నుంచి జగ్గయ్యపేట వద్ద ఎన్టీఆర్ జిల్లా మీదుగా నేడు విశాఖలో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు నగరానికి చేరుకుంది. 11.30 గంటల వరకు ఎన్ ఏ డి నుండి ప్రారంభమైన యాత్ర డాబాగార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైతన్య రథమునకు సహజయోగులు ఘనస్వాగతం పలికారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి మానవులు తమలో వున్న దైవశక్తితో అనుసంధానింపబడాలనే సదుద్దేశ్యంతో 1970 మే 5 న సహజ యోగ ధ్యానాన్ని ప్రవేశపెట్టారని కల్లూరు రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ రీజినల్ కోఆర్డినేటర్ సుభాషిణి, రాష్ట్ర కమిటీ మెంబర్స్ స్వాతి ప్రియా, శ్రీనివాస్ రావు, జిల్లా కోఆర్డినేటర్ రమేష్, మీనాక్షి లు మాట్లాడుతూ సహజ యోగ ధ్యానం వలన సమాజంలో శాంతి స్థాపించబడును అన్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరికి సులభంగా సాధన చేసుకోగలిగే ధ్యాన పద్ధతి ఇది అని అన్నారు. ఈ ధ్యానము అందరికి ఉచితంగా నేర్పించబడునని తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ ఆరు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రథయాత్ర జరగనుందన్నారు. సుమారు 150 దేశాల్లో సహజ యోగాన్ని ప్రజలు ఆచరిస్తున్నారని తెలిపారు.