తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు జరిగిన ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రధానోపాధ్యాయురాలు కే.పద్మావతి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తణుకు మండల ఎంఈఓ -2 జి.బి.వి. ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల చరిత్ర, పాఠశాలలోని సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు గురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అదేవిధంగా పాఠశాల యొక్క ఘనమైన చరిత్రను కీర్తిని ప్రశంసిస్తూ తణుకు పరిధిలోని విద్యార్థులు ఈ పాఠశాలలో చేరి మంచి అవకాశాలను పొందాలని అన్నారు. అనంతరం ఎన్సిసి, నేవీ, స్కౌట్స్, గైడ్స్ దళాల ప్రదర్శనను తిలకించారు. అంతర్జాతీయ హోమియోపతి దినోత్సవ సందర్భంగా సీనియర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ చాపరాల కృష్ణ హోమియోపతి వైద్యం ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ప్రపంచ సహోదర దినోత్సవ సందర్భంగా స్టాఫ్ సెక్రటరీ జి.జే. ప్రభువరం మాట్లాడుతూ సోదర, సోదరీమణుల ఆవశ్యకత గురించి విద్యార్థులకు అవగాహన కలుగజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ ఎం. వెంకటలక్ష్మి ఇతర సభ్యులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
