ప్రజలు వారి సమస్యలను 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా ఫిర్యాదు చెయ్యవొచ్చు – కలెక్టర్ పి.ప్రశాంతి
ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం ఏప్రియల్ 28 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు , జిల్లా, డివిజన్ మండల, మునిసిపల్ క్షేత్ర స్థాయి అధికారులు తప్పనిసరిగా హజరు కావాలని స్పష్టం చేశారు.
ప్రజలు వ్యయ ప్రయసలుపడి ప్రభుత్వ కార్యాలయాలకు వొచ్చి ఫిర్యాదు చెయ్యకుండా 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా తమ సమస్యలను తెలియ చేయడం ద్వారా కూడా పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియ చేశారు. సత్వర పౌర సేవలను పొందేందుకు ప్రభుత్వం అమలులోకి తీసుకుని వొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ను తమ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.