నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం వేలివెన్ను గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో టిడిపి ఆధ్వర్యంలో సంస్థగత కమిటీలు కార్యక్రమాలు ఏర్పాటు ఉందని వాటికోసం నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో సమిష్టి కృషితో టిడిపి అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. నిడదవోలు పట్టణ అధ్యక్షుడు గా పనిచేసిన కొమ్మిన వెంకటేశ్వరరావు ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారని, ఆయన ప్రకటించిన రాజీనామాను టిడిపి ఆమోదించలేదని రానున్న రోజుల్లో ఆయన సేవలు పార్టీకి అవసరం కాబట్టి వారి నేతృత్వంలో కుటుంబ సాధికారసారధులు బూత్ కమిటీలు గ్రామ మండల కమిటీలు త్వరగా పూర్తి చేయాలని శేషారావు సూచించారు. నియోజకవర్గ టిడిపి పరిశీలకులు డి.సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి అన్ని కమిటీలు పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టిడిపి అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు ఉండ్రాజవరం మండలం టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ పెరవలి మండలం టిడిపి నాయకులు అతికాల శ్రీను, ఈర్పిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
