బిజేపి జాతీయ, రాష్ట్ర పార్టీ నాయకత్వ సూచన మేరకు వేమూరి వెంకటసుబ్బయ్య కళ్యాణ మండపం, మచిలీపట్నం నందు జరిగిన వక్ఫ్ బోర్డ్ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మహిళా బిజేపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పి. రవికిరణ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సయ్యద్ బాషా, బిజెపి నాయకులు జిల్లా కన్వీనర్ పి. కృష్ణకాంత్, జిల్లా ప్రధానకార్యదర్శి జిల్లా కన్వీనర్ శేషుకుమార్, పార్టీ నాయకులకు, కార్యకర్తలు మరియు మైనారిటీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ కొత్త చట్టం వల్ల ముస్లిం సోదరులు అనగారిన వర్గాల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో ముస్లిం మహిళల ప్రాతనిజం ఈ చట్టంలో ఏవిధంగా ఉందో తెలియజెప్పారు. అనంతరం సయ్యద్ భాష మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనగా హిందూ మతతత్వ పార్టీ అని ఒక అపోహ ఉండడంతో బిజెపిలో మైనార్టీ మోర్చాకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ అందరి మన్ననాలను పొందిన ఆయన బిజెపి ఒక గొప్ప పార్టీ అని అలాగే ప్రభుత్వం తెచ్చిన ఈ యొక్క వర్కు సవరణ చట్టం తన తోటి ముస్లిం సోదర సోదరీమణులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సమావేశంలో తెలియజేశారు. అనంతరం ముఖ్యఅతిథి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ ఒక గొప్పదనం మధ్యస్థాయి దిగువ మధ్యతరగతి వర్గాల్లో పేద ముస్లిం మహిళలకు ఒక్క చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు ముఖ్యంగా ముస్లిం మహిళలకు ఈ కొత్త చట్టంలో వచ్చిన ప్రాధాన్యతా అంశాలను తెలియజేశారు.
