అప్పుడు సీజ్ ద షిప్ ఇప్పుడు స్టార్ట్ ద షిప్ అని అంటున్న పౌరసరఫరాలశాఖ మాజీ మంత్రి, తణుకు మాజీ శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. బుధవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ అన్న వ్యాఖ్యలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ లో సీజ్ ద షిప్ అని అన్నారని కానీ నేడు కూటమినేతలు బహిరంగంగానే స్టార్ట్ ద షిప్ అన్న విధంగా రేషన్ బియ్యం దందా నడుస్తుందని అన్నారు. యదేచ్ఛగా షిప్పులు పోతున్నాయి లారీలు వెళుతున్నాయి అన్నారు. రేషన్ బియ్యం విషయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నానా హంగామా చేశారని, నేడు ధాన్యం కొనుగోలు పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిందని, మాయిశ్చర్ రెండు మూడు పాయింట్లు కటింగ్ చేయడం, బస్తాకి 300, 400 తీసివేయడం చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయంలో రైతులకు ఈక్రాప్ చేసి ఇన్సూరెన్స్ చెల్లించే వాళ్ళమని డైరెక్ట్ గా ఆర్బికే నుండి ధాన్యం తరలించేవారుమని కారుమూరి అన్నారు. రైతు ఖాతాల్లోకి డైరెక్ట్ గా అమౌంటు వేసేవారమని అన్నారు. వైసిపి హయంలో రేషన్ మాఫియా విషయంలో పట్టుకున్న లారీలను నెలలో ఒకసారి ఆక్షన్ పెట్టి రైస్ అమ్మి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వారమని అన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో లారీలు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాయి తప్ప పట్టుకున్న నాధుడు కనపడడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు నడ్డి విరిచేసారని ధాన్యానికి ధర లేదు, మిర్చికి ధర లేదు, పొగాకు కి, కోకోకి రేటు లేదని అలాగే మినుములు పెసలు వంటి పంటలకు, టమోటా కనీస మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని కారుమూరి అన్నారు. కొనుక్కునే సమయంలో వినియోగదారునికి బాదుడే బాదుడు అని అన్నారు. ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
