శ్రీ రామకృష్ణ సేవా సమితి, సజ్జాపురంలోని వివేకానంద హ్యూమన్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఆధ్వర్యాన జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరంలో ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ ట్రైనర్ అయిన బి.యం.గోపాల రెడ్డి (గోపి మామ) మోటివేషనల్ మ్యాజిక్ తో చిన్నారులను అలరిస్తూ, ఆలోచింప చేశారు. అలవాట్లు, సెల్ ఫోన్, టి.వి. ల వల్ల నష్టాలు, మైండ్ పవర్, సాధించలేనిది ఏదీ లేదు, ఓజోన్ పరిరక్షణ, దేశభక్తి, ఐకమత్యం, పెద్దలను గౌరవించడం మొదలైన విషయాలు మ్యాజిక్ ట్రిక్స్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కరాటే రామకృష్ణ కరాటే మరియు డ్రాయింగ్ నేర్పారు.
సమితి కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, కోఆర్డినేటర్స్ గిరీశ్వరరావు, అక్కింశెట్టి రాంబాబు, రిసోర్స్ పర్సన్స్ మహేష్, ఇందిర, జి.యస్.ఎన్., తారకాపురి రాజేంద్ర తదితరులు సుమారు వందమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
