జూన్ 21 వరకు వివిధ వర్గాల, శాఖల వారితో యోగాంధ్ర కార్యక్రమం షెడ్యూల్

రోజు వారి ప్రణాళికలతో రూట్ మ్యాప్ సిద్ధం

  • జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమం లో భాగంగా జిల్లా లో వివిధ వర్గాల ప్రజల తో రోజు వారీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ పి. ప్రశాంతి తెలియచేశారు. అదే విధంగా ఒక ప్రత్యేక రోజున మీడియా ప్రతినిధులతో యోగాంధ్ర కార్యక్రమం రూపకల్పన చెయ్యనున్నట్లు తెలిపారు.

తేదీల వారిగా ఒక్కో రంగం వారితో..

  • మే నెలలో
    26న యోగా కేంద్రాల వారితో,
    27 జైళ్ల లో ,
    28న అంగన్వాడీ, ఆరోగ్యకార్యకర్తలతో, 29న రైతులతో,
    30న వైద్యాధికారులతో,
    31న పోలీసులు, సైనికాధికారులు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగులతో,
    జూన్ నెలలో
    1న కుటుంబ సభ్యులతో ,
    2న ఆటో, లారీ అసోసియేషన్లతో,
    3న మత్స్యకారు లతో,
    4న గిరిజనులు,
    5న ఆశ, ఏఎన్ ఎంలు,
    6న స్వచ్ఛంధ సంస్థలు ,
    7న ఉపాధ్యాయులతో ,
    8న వృద్ధులతో ,
    9న కళాకారులు, యువజన సంఘాలు, 10న ఉపాధి హామీ పనివారి తో ,
    11న బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు, వీధి వ్యాపారులు,
    12న కార్మికులతో,
    13న ఉపాధ్యాయులు, విద్యార్థులతో, 14న దివ్యాంగులు,
    15న సెలబ్రిటీలు,
    16న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు,
    17న పారిశుద్ధ్య కార్మికులు,
    18న ఇంజినీరింగ్ విద్యార్థులు,
    19న క్రీడాకారులు, క్రీడాసంఘాలు,
    20న స్వయం సహాయక సంఘాల మహిళలతో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21న విశాఖలో జరిగే యోగా దినో త్సవం సందర్భంగా అదేరోజు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు,సామాజిక సేవా సంస్థలనూ భాగస్వాములను చేస్తూ యోగ అభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగతుందని తెలిపారు.
Scroll to Top
Share via
Copy link