హాజరైన ఎమ్మెల్యే ఆరెమెల్లి రాధాకృష్ణ
ఇస్కాన్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఇస్కాన్ ఆధ్వర్యంలో తణుకులో సోమవారం రాత్రి భక్తి శ్రద్ధలతో హరే కృష్ణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇస్కాన్ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి మురళీనాథ్ శ్యామ్ దాస ఆధ్వర్యంలో స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసస్కాన్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ మహోత్సవంలో హరినామ సంకీర్తన, ప్రవచనం, జప మెడిటేషన్, శ్రీ రాధాకృష్ణుల మహా అభిషేకం, చప్పనభోగ సమర్పణ, మహా హారతి, మహా ప్రసాద వితరణ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.