దాతలు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి

యల్లారమ్మ ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు

పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

దాతలు ముందుకు రావాలని పిలుపు

దాతలు, గ్రామస్తుల సహకారంతో యల్లారమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం మండపాక యల్లారమ్మ ఆలయంలో పిచ్చికల కోటేశ్వరరావు, లక్ష్మి దంపతులతో రూ. 2.50 లక్షలతో నిర్మించన మండపాన్ని, బలుసు కేశవస్వామి, పార్వతి దంపతుల పేరుతో ఎన్టీఆర్‌ సుజల స్రవంతిలో భాగంగా నిర్మించిన వాటర్‌ప్లాంటు, విశ్రాంతి, ప్రసాదాల వితరణ హాలును ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. 2014–19 హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కమిటీ ద్వారా దేవాలయయ ప్రాంగణంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. దాతృత్వాన్ని అలవాటు చేసుకుని దాతలు ముందుకు రావడం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పారు. తోటి వారికి సాయపడే విధంగా సంపాదించిన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. అదే స్ఫూర్తితో బలుసు కేశరావు. పిచ్చుకల కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link