అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో రైతుల పెట్టుబడి అవసరాల కోసం ప్రతి ఏటా భూమి ఉన్న ప్రతి రైతుకు రూ. 20వేల చొప్పున అందించనున్న ప్రభుత్వం.
ఈ పథకంలో భాగంగా మొదటి విడతగా రూ. 7 వేలు జమ అయిన సందర్భంగా రైతులు నియోజవర్గం రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రాక్టర్లతో ర్యాలీ.
తణుకు ఎన్టీఆర్ పార్క్ నుండి బయలుదేరి ఎన్.ఎస్.సి బోస్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, ఆపిల్ ఆస్పటల్ మీదుగా పాలిటెక్నిక్ కాలేజ్, వెంకటేశ్వర థియేటర్ సెంటర్ మీదుగా నరేంద్ర సెంటర్ వరకు ర్యాలీ.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు