కలెక్టరేట్ లో జూన్ 3 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా

** వికాస కేంద్రం , తూర్పు గోదావరి

జూన్ 3 వ తేదీ మంగళవారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో ప్రముఖ ‘ఐ టి సి లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్’ కంపెనీలలో ఆపరేటర్ జాబ్స్ సంబంధించి “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు ” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఐ టి ఐ, ఇంటర్ (ఒకేషనల్) ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు (పురుషులు, మహిళలు) అభ్యర్థులు అర్హులు అన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 3 వ తేదీ మంగళవారం ” కలెక్టరేట్ “(బొమ్మూరు హార్లీక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం” వద్ద ఉదయం 9.30 గంటలకు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ యొక్క జెరాక్స్ కాపీలతో నేరుగా హాజరుకావలెనని తెలిపారు. మరిన్ని వివరాలకు www.vikasajobs.com లేదా ఫోన్ నంబర్ 7660823903 ను
సంప్రదించాలని తెలిపారు

Scroll to Top
Share via
Copy link