పాలంగి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం 2025 సందర్భంగా గురువారం ఉండ్రాజవరం మండలం, పాలంగి గ్రామంలో సంపద సృష్టి కేంద్రం వద్ద పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి వి ఎస్ రామారావు, పంచాయతీ విస్తరణ అధికారి ఆంజనేయ శర్మ, పాలంగి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి వన మహోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ మండల టి ఏ కాంతారావు, పాలంగి గ్రామ సెక్రటరీ హసన్ జానీ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులు పంచాయతీ సిబ్బంది వన మహోత్సవ ప్రతిజ్ఞలు చేశారు.

Scroll to Top
Share via
Copy link