సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ప్రభుత్వం అండ

తొలి ఏడాదిలోనే రూ. 500 కోట్లు నిధులు కేటాయింపు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

33 మందికి రూ.12.67 లక్షల చెక్కులు అందజేత

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంలో భాగంగా పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలను ఆదుకునేవిధంగా మొదటి ఏడాదిలోనే రూ. 500 కోట్లు నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధికి కేటాయించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు రూ. 12.67 లక్షలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా వైద్యసేవలు పొందలేక సొంతఖర్చులతో వైద్యం చేయించుకున్న వారి కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబునాయుడు సాయం అందించి కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు పడకుండా అందరికీ అండగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా నిలబడతానని చెప్పిన మాటకు చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ పేదలను ఆదుకునేందుకు తనవంతు సహాకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link