జూన్ 26న రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద జరగనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంఖుస్థాపన పనులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్
ముఖ్య అతిథులుగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయనున్న
- కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్
- ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
- ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి
- దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు:మంత్రి దుర్గేష్
- ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి..తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం:మంత్రి కందుల దుర్గేష్
- అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రాత్మక హేవలాక్ వంతెనకు కొత్త సొబగులు, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహం
- కడియం నర్సరీలు ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా అభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్
- నిడదవోలు సమీపంలోని కోట సత్తెమ్మ ఆలయానికి కొత్త శోభ, గోదావరి తీర ప్రాంతాల సుందరీకరణ
- బ్రిడ్జిలంకలో బోటింగ్, టెంట్ సిటీ ఏర్పాటు:మంత్రి కందుల దుర్గేష్
- గోదావరి కాలువలో బోటింగ్, గోదావరికి నిత్య హారతి:మంత్రి కందుల దుర్గేష్
- అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ధన్యవాదాలు:మంత్రి కందుల దుర్గేష్
- ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తాం:మంత్రి కందుల దుర్గేష్
- అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం:మంత్రి కందుల దుర్గేష్
- అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా 8వేల మందికి పైగా ఉపాధి అవకాశం, ఆర్థిక అభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కేంద్రం ద్వారా దాదాపు రూ.375 కోట్ల పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు: మంత్రి కందుల దుర్గేష్