నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్షంగా 1975 జూన్ 25 న విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జన్సీ) కు నేటికి 50 సంవత్సరములు, అందుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గము, తణుకు పట్టణములో వికసిత్ భారత్ కన్వీనర్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తణుకు టౌన్ పాత పోలీస్ స్టేషన్ వీధిలో గల అమూల్య మెస్ మేడపైన సభను నిర్వహించడం జరిగినది.
ప్రజాస్వామ్యాన్ని మంటకలిపి, పత్రికా స్వేచ్ఛని హరించి, భారత దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిల్చిన
ఈ రోజును తణుకు పట్టణంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సభ నిర్వహించినట్లు తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ ముళ్ళపూడి రేణుక తెలియజేసారు. ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలను వ్యతిరేకించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీకి ఎదురు నిలిచి, రాజ్యాంగ విలువలు కాపాడటానికి పోరాడి, తణుకు పట్టణంలో అరెస్టు కాబడిన వ్యక్తులు, మహనీయులు వెలిచేటి గోవిందరావు (అడ్వకేట్), రిటైర్డ్ ఎంప్లాయ్ దానయ్య ని జాతీయవాదుల సమక్షంలో
డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ (హరిబాబు), శ్రీమతి రేణుక, పెద్దలు పూలమాలలు వేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, న్యాయవాదులు , బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.