ప.గో. జిల్లా చైర్ పర్సన్ మరియు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఏలూరు ఎస్ శ్రీదేవి శనివారం తణుకు సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి, వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయసేవలకమిటీ ద్వారా ఉచితన్యాయసహాయం, సేవలు అందిస్తారని, ప్రతి ఒక్కరు న్యాయవాదిని కలిగిఉండాలని తెలిపారు. జూలై 5వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ ను కేసులు వున్న అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కేసులు రాజీ చేసుకుని ప్రశాంతంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో జిల్లా న్యాయ సేవల సంస్థ సెక్రటరీ శ్రీ కె. రత్న ప్రసాద్, తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయిరాం పొతర్లంక, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సూరంపూడి కామేష్, బెంచ్ కోర్టు మెజిస్ట్రేట్ శ్రీ తాడి ఆంజనేయులు. సబ్ జైల్ సూపరింటెండెంట్ జి. మోహనరావు సిబ్బంది పాల్గొన్నారు.
