- అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
స్వర్ణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా తణుకు పట్టణంలో ఆదివారం లయన్ బూరుగుపల్లి వెంకట్రావు ప్రమాణస్వీకారం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ లో కోశాధికారిగా, సభ్యునిగా వివిధ రకాలసేవలు అందించిన వెంకట్రావును అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల క్లబ్ సభ్యులు అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హాజరైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవము చేసిన కార్యవర్గాన్ని అభినందించారు. లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న పలు సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. నూతన కమిటీ ద్వారా తణుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో పేదలకు, విద్యార్థులకు అవసరాల్లో ఉన్నవారికి మరిన్ని సేవలు అందించాలని నూతన కమిటీని కోరారు. కార్యదర్శిగా చిరంజీవి కుమారి, కోశాధికారిగా గూన సుబ్బరాజు ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కమిటీని లయన్ మేక శ్రీరామ సురేష్ ప్రకటించగా మాజీ గవర్నర్ లయన్ రంగారావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వావిలాల సరళ దేవి, లయన్ పుట్ట విజయశ్రీ, వంక రాజకుమారి, యడ్లపల్లి తులసి, బూరుగుపల్లి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.
