రవాణా వాహనాల ఫిట్నెస్ తనిఖి ప్రవేటీకరణ ఉపసంహరించుకోవాలని ఆటో ఓనర్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వలరాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు రాంబాబు మాట్లాడుతూ రవాణా వాహనాల ఫిట్నెస్ తనిఖీ ప్రవేటికరణ ఉపసంహరించాలని జిల్లా అఖిల పక్ష ప్రవేట్ ట్రాన్స్పోర్ట్ సంఘాలు ఆధ్వర్యంలో 2025జులై 1ఛలో రాజానగరం కార్యక్రమం జయప్రదం చేయాలని రవాణా వాహనాల కార్మికులకు విఙ్గప్తి చేశారు రాంబాబు మాట్లాడుతూ తనిఖీలు పేరుతో గంటల తరబడి వేచి ఉండమని చెప్పి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని వాహనాలు తనిఖీ సందర్భంగా డామేజ్ కి ATS సెంటర్ కి ఎటువంటి సంబందం లేదని వాహన యజమానులను లో పలకి అనుమతించకుండా నైపుణ్యం లేని వారితో ఫిట్నెస్ చేయించడం వల్ల వాహనాల దెబ్బతింటున్నాయని వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఎల్లే కృష్ణం రాజు సత్తుల రమేష్ రాజేష్ వేంకటేశ్వర రావు యేసు కరీం లాల్ బాషా. అన్వర్ తదితరులు పాల్గొన్నారు
