రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు అభినందనీయం

సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి

ప్రతి ఒక్కరూ సామాజిక సేవ దృక్పథాన్ని అలవరుచుకోవాలి

రాజమహేంద్రంలో నిర్వహించిన రోటరీ క్లబ్ విజయం డిస్ట్రిక్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏడాది కాలంగా సేవా రంగంలో కృషి చేసి అవార్డులు పొందిన పలువురికి అవార్డుల ప్రదానం, అభినందనలు

ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంధ సంస్థలు చేదోడు వాదోడుగా అండగా నిలుస్తుండటం శుభ పరిణామం

అతిమంగా ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థల లక్ష్యం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి అని స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, పౌర సమాజం పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం రాజమహేంద్రవరం జెఎన్ రోడ్డులోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మీ కన్వెన్షన్ సెంటర్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన విజయం డిస్ట్రిక్ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గడిచిన ఏడాది కాలంగా సేవాభావాన్ని చాటుతూ అవార్డులు పొందిన పలువురికి పురస్కారాలు ప్రదానం చేసి పేరుపేరున మంత్రి దుర్గేష్ అభినందించారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సామాజిక సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంధ సంస్థలు చేదోడు వాదోడుగా అండగా నిలుస్తుండటం శుభ పరిణామమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సమాజానికి రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.సమాజం నుండి తీసుకోవడమే కాదు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న స్ఫూర్తి ప్రశంసించదగినదన్నారు.రోటరీ క్లబ్ సభ్యులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం అభినందనీయమన్నారు. ఈ క్రమంలో అత్తుత్తమ సేవలు ప్రదర్శించిన వారికి పురస్కారాలు ప్రదానం చేయడం మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భారతదేశం ఒక్కటే పోలియో రహిత దేశంగా మారిందన్నారు. ఈ అంశంలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తోందన్నారు. పోలియో ఫ్రీ ప్రపంచంగా మార్చేందుకు రోటరీ క్లబ్ చేస్తున్న కృషి కొనియాడదగినదన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా తమ దగ్గరున్న వ్యాక్సిన్ ను ప్రజానీకానికి అందించేందుకు అనుమతి కావాలని క్లబ్ నిర్వాహకులు కోరారని, తదుపరి కేబినెట్ లో ఈ అంశంపై మాననవనరుల మంత్రి నారా లోకేష్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో విద్యార్థి దశ నుండి ఉన్నానని తన ప్రస్థానాన్ని మంత్రి దుర్గేష్ తెలిపారు. అప్పట్లో మారేడుమిల్లిలో రోటరీ క్లబ్ సేవలు అందించే కార్యక్రమంలో తాను ఒక సభ్యుడిగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. తాను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఇలాంటి ప్రఖ్యాత క్లబ్ లలో సభ్యుడిగా సేవా భావాన్ని అలవరుచుకొన్నానని ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందానని తెలిపారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రత్యేకించి విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులతో ముందుకువెళ్తుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.పౌర సమాజం,స్వచ్ఛంధ సంస్థలు ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రజా సేవలో భాగమై ప్రభుత్వానికి తోడుగా నిలవాలన్నారు. అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా సేవా కార్యక్రమాలు అందిస్తున్న సంస్థగా రోటరీ ఇంటర్నేషన్ క్లబ్ నిలుస్తుందన్నారు. చేయి చేయి కలిపి ముందుకు వెళ్దామని, ప్రభుత్వ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉండాలని సూచించారు. తద్వారా క్లబ్ కు కావాల్సిన అనుమతులు అందించేందుకు దోహదపడతామన్నారు. ఈ సందర్భంగా కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరం గురించి,తమ రచనలు, విధానాల ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించిన ఆదికవి నన్నయ్య, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు,ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం తదితర ఎందరో నడయాడిన నేలపై ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Scroll to Top
Share via
Copy link