‘తొలిఅడుగు’ ద్వారా మరింత సంక్షేమం, అభివృద్ధి
చంద్రబాబు స్ఫూర్తితో గ్రామాల అభృద్ధికి చర్యలు
అత్తిలి మండలంలో ‘ఇంటింటికీ టిడిపి’ ప్రారంభం
ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సుపరిపానకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా మరింత సంక్షేమం, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో తణుకు నియోజకవర్గంలో సైతం ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని ముఖ్యంగా పెన్షన్లు, మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనంతోపాటు రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత పథకం, యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కె.సముద్రపుగట్టు గ్రామంలో దాదాపు రూ. 90 లక్షలతో అభివృద్ధి పనులతోపాటు రూ. 5 కోట్లు మేర సంక్షేమాన్ని అందించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కాలనీల్లో గత ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని దాన్ని అధిగమించిడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందజేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు కూటమి ప్రభుత్వం పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు ప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.