ఆగష్టు 6,7 తేదీలలో ఉండి లో జరుగనున్న సీపీఐ 27 వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి…

ఆగష్టు 6,7 తేదీలలో ఉండి లో జరుగనున్న సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా 27 వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో జరిగిన సీపీఐ తణుకు ఏరియా మహాసభలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభకు సీపీఐ నాయకులు చుండ్రు వెంకట్రావు అధ్యక్షత వహించారు. మహాసభ సందర్బంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. తొలుత సీపీఐ పతాకాన్ని సీపీఐ సీనియర్ నాయకులు వాకలపూడి వీర రాఘవులు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో భీమారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం రద్దుచేసి ప్రజలపై మోపిన విద్యుత్ భారాలు తొలగించాలని,స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచన విరమించు కోవాలని, ట్రూఅఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా ఈనెల 5 న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు విజయవంతం చేయాలన్నారు.కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్, 10 గంటల పని విధానం రద్దు చేయాలని కోరుతూ జూలై 9 న కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని భీమారావు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలుకు,ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ సీపీఐ నిరంతర ప్రజాపోరాటాలకు సమాయత్తం కావాలన్నారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. సీతారాం ప్రసాద్, సికిలే పుష్పకుమారి మాట్లాడారు.
సీపీఐ సీనియర్ నాయకులు వాకలపూడి వీరరాఘవులు, వంక నాగమణి లను దుశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సీపీఐ తణుకు ఏరియా కార్యదర్శిగా సికిలే పుష్పకుమారి మహాసభలో తొమ్మిదిమందితో సీపీఐ తణుకు ఏరియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ తణుకు ఏరియా కార్యదర్శిగా సికిలే పుష్పకుమారి, కమిటీ సభ్యులుగా వై.నాగలక్ష్మి, సావారపు దేవీ, మంగం పెంటయ్య, పంపన నరశింహమూర్తి, కౌరు శ్రీను, పెదపోలు వెంకట్రావు, సబ్బితి బ్రహ్మయ్య, బొక్కా సత్యనారాయణ ఎన్నికయ్యారు.

Scroll to Top
Share via
Copy link