విశాఖపట్నం: జూలై 12 (కోస్టల్ న్యూస్)
విశాఖపట్నం అంబేద్కర్ భవన్ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 16 గ్రూప్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిరధ మహారధులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్, ఆల్కహాలిక్స్-అనానిమస్ సంస్థ వారు పుష్పగుచ్ఛం ఇచ్చి శ్రీనివాస్ ని సత్కరించారు ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా ఇంతటి చక్కటి కార్యక్రమానికి తనని భాగస్వామ్యం చేసి ప్రసంగించే అవకాశం కల్పించడం పై హర్షం వ్యక్తం చేశారు తాగడం గొప్ప కాదు – తాగడం మానేసి బ్రతకడం గొప్ప అని, మద్యం సేవించి చెడు అలవాట్లకు బానిస అవ్వడం వలన చెడిపోయేది మనం మాత్రమే కాదు అని దాని ప్రభావం కుటుంబం పై మన పిల్లల భవిష్యత్ పై ఆధారపడి ఉంటుంది అని మద్యం సేవించడం వలన మనం సమాజం లో గౌరవించకపోవడం తప్పితే మనం ఒకరం ఉన్నాం అని గుర్తించకవడం చాలా బాధాకరం అని అలాంటి ఈ పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం కలిగి వ్యసనాలు నుండి మనం బయటపడటం లో ఆల్కహాలిక్స్-అనానిమస్ అనే సంస్థ చూపించిన చొరవ ఎంతో గొప్పదని మన్యాల శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా మీరు మారడం వలన మీ కుటుంబాల్లో వెలుగులు నింపేవారు అవుతారని తద్వారా సమాజానికి మనం ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అని పేర్కొన్నారు.
మన్యాల శ్రీనివాస్ ప్రసంగంతో సభలో ప్రజలు అందరూ కేరింతలతో, కరతాలధ్వనులతో అభినందించారు.