కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు అలాగే సాధించిన విజయాలు, అలాగే కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియచేసే ప్రక్రియే డోర్ టు డోర్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు సారధ్యంలో ఉండ్రాజవరo మండలం తాడిపర్రు గ్రామంలో నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు -ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని ప్రజలకు కరపత్రాలను ఇచ్చి ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, తాడిపర్రు గ్రామ టిడిపి నాయకులు పెండ్యాల గొవిందు, వాకలపూడి సత్యనారాయణ, కాసగాని రామచంద్రం, క్లస్టర్, కో కన్వీనర్ యూనిటీ ఇంచార్జ్, బూత్ ఇంఛార్జ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
